రాయన్ నుండి 'పీచు మిఠాయ్యి' సాంగ్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Thu, May 23, 2024, 07:43 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని పీచు మిఠాయ్యి అనే టైటిల్ తో రేపు సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం జూన్ 13న విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM