'ఆయ్' సెకండ్ సింగల్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Thu, May 23, 2024, 06:19 PM

టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ కొత్త దర్శకుడు అంజి కంచిపల్లి తో తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఆయ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ ని రంగనాయకి అనే టైటిల్ తో మే 25, 2024న 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటించింది. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానున్నది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
సీనియర్ నటి రమాప్రభ ఇంట విషాదం Fri, Oct 18, 2024, 10:25 AM
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM