రన్ టైమ్ ని లాక్ చేసిన 'లవ్ మి – ఇఫ్ యు డేర్'

by సూర్య | Thu, May 23, 2024, 06:17 PM

రౌడీ బాయ్స్‌లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి – ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా 136 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మే 25, 2024న విడుదల కానుంది.

Latest News
 
కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హన్సిక Fri, Oct 18, 2024, 02:13 PM
పవన్ కళ్యాణ్ OG మూవీ షూటింగ్ నుండి ఫొటోస్ రిలీజ్.... Fri, Oct 18, 2024, 12:20 PM
సీనియర్ నటి రమాప్రభ ఇంట విషాదం Fri, Oct 18, 2024, 10:25 AM
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM