రాబోతున్న రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌లో ఆరుగురు హీరోయిన్లు

by సూర్య | Wed, May 22, 2024, 06:17 PM

రౌడీ బాయ్స్‌లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి – ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాని మే 25,2024న విడుదల కానుంది. ఒక ఇంటర్వ్యూలో, ఆశిష్‌ను ఈ సినిమాలో దెయ్యం క్యారెక్టర్ లో ఎవరు నటించారు అని అడిగినపుడు దానికి నటుడి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆశిష్ మాట్లాడుతూ.... సినిమాలో ఐదుగురు హీరోయిన్లున్నారు. మేము ఇప్పటి వరకు వాటి గురించి ఏమీ వెల్లడించలేదు. ప్రేక్షకులు పెద్ద స్క్రీన్‌లపై సర్ ప్రైజ్ ఎలిమెంట్స్‌ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. వైష్ణవి చైతన్య మెయిన్ హీరోయిన్. సినిమా వెళ్ళ్తున్న కొద్దీ ఇతర మహిళా కథానాయికలు కథనంలోకి వస్తారు. దెయ్యం పాత్రలో నటించిన వ్యక్తిని చేర్చినట్లయితే లవ్ మీలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు అని వెల్లడించారు. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM