15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్

by సూర్య | Wed, Apr 24, 2024, 07:52 PM

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'మిరాయ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 18, 2025న పెద్ద స్క్రీన్‌లపై 2D మరియు 3D ఫార్మాట్‌లలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషలలో విడుదల కానుంది.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టైటిల్ టీజర్ యూట్యూబ్ లో 15 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ అడ్వెంచరస్ మూవీలో హాయ్ నాన్న నటి రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది.


ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను గౌర హరి అందించనున్నారు. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నారు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM