శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'గేమ్ ఛేంజర్'

by సూర్య | Wed, Apr 24, 2024, 03:42 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, శంకర్ ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్ విమానాశ్రయంలో మరియు నగరంలోని రోడ్లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ఇంకొన్ని రోజులు కొనసాగుతుందని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.


ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM