'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా?

by సూర్య | Fri, Apr 19, 2024, 06:07 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ మేకర్స్ మే 1న నటుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో అజిత్ కి జోడిగా తమిళ స్టార్ నటి త్రిష జోడిగా కనిపిస్తుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గీలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం అందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM