by సూర్య | Thu, Apr 11, 2024, 04:40 PM
మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. కొద్దిరోజుల క్రితమే ఈ పాన్-ఇండియన్ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ది రాజా సాబ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది.
రాజా సాబ్ 2025 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుందని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోనందున విడుదలపై సందేహం నెలకొంది. ఏది ఏమైనప్పటికీ, మారుతీ మరియు అతని బృందం సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి 2025 సంక్రాంతికి రాజా సాబ్‌ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ జోడిగా కనిపించనుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ హారర్-కామెడీ డ్రామాకి థమన్ సంగీతం అందించనున్నారు.