'నడికర్' తెలుగు వెర్షన్ టీజర్ అవుట్

by సూర్య | Thu, Apr 11, 2024, 02:47 PM

తెలుగులో అత్యద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. తాజాగా ఇప్పుడు ఇతర భాషా చిత్రాలను కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించడం ప్రారంభించింది. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌తో నడికర్ తిలగం అనే టైటిల్ తో ఒక చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.


ఈ చిత్రంలో టోవినో థామస్ సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ టీజర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


సౌబిన్ షాహిర్ బాల పాత్రలో కనిపించనుండగా, భావన కథానాయిక. ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ భాసి, లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 3, 2024 థియేటర్లలో విడుదల కానుంది.


డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్ లాల్ జీన్ పాల్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప మేకర్స్‌తో కలిసి అల్లన్ ఆంటోని మరియు అనూప్ వేణుగోపాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. యక్జాన్ గారి పెరీరా మరియు నేహా ఎస్ నాయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM