రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'ప్రేమలు'

by సూర్య | Thu, Apr 11, 2024, 03:32 PM

గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమలు ఈ సంవత్సరం మాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో నస్లెన్ కె గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన జంటగా నటించారు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ మార్చి 8, 2024న విడుదల అయ్యింది.

ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా మరియు తమిళ, మలయాళ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాలో శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Latest News
 
'పుష్ప 2' గురించి అనసూయ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు Thu, Oct 31, 2024, 06:19 PM
సల్మాన్ ఖాన్‌కి మరో హత్య బెదిరింపు Thu, Oct 31, 2024, 06:13 PM
దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన 'రామం రాఘవం' టీమ్ Thu, Oct 31, 2024, 06:06 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 31, 2024, 06:01 PM
'దేవకి నందన వాసుదేవ' స్పెషల్ దివాళీ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 05:52 PM