by సూర్య | Thu, Apr 11, 2024, 02:45 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికాలో $2.8M మార్క్ ని చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత అందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.