by సూర్య | Thu, Apr 11, 2024, 02:43 PM
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్.
ఈ సినిమాలో ప్రియమణి అజయ్ దేవగన్ భార్యగా నటించింది. బోనీ కపూర్ ఈ జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు.
Latest News