నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం

by సూర్య | Fri, Mar 29, 2024, 12:00 PM

మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా అంటూ ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమాలోని డైలాగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌టం . ఆ డైలాగే టెటిల్‌గా అభిన‌వ్ హీరోగా ఇటీవ‌ల సినిమా కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్రవరి 23న ఈ సినిమా ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!' థియేట‌ర్ల‌లో విడుద‌లగా మిశ్ర‌మ స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. తిరుప‌తి రావు దర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. వైశాలి రాజ్, లావణ్య రెడ్డి క‌థానాయిక‌లుగా న‌టించారు. కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యాన‌ర్‌పై వంశీ నందిపాటి స‌మ‌ర్ప‌ణ‌లో ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ పలెటూరులో నివ‌సించే మనోహర్ (అభినవ్ గోమఠం)కు చిన్న‌ప్ప‌టి నుంచే డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఈ క్ర‌మంలో చ‌దువులో వెన‌క‌బ‌డి ప‌దో త‌ర‌గ‌తితో ఆపేస్తాడు. త‌ర్వాత వాల్ పెయింటింగ్స్ చేస్తు సెటిల‌వుతాడు. దీంతో అత‌నికి పిల్ల‌ను ఇవ్వ‌డానికి ముందుకు రారు. ఓ సంబంధం సెటిల‌వ‌గా పెళ్లిరోజు పెళ్లికూతురు లేచిపోతుంది. ఇలా అడుగ‌డుగునా అవ‌మానాలు ఎదుర్కొంటుంటాడు. దీంతో మిత్రుల సాయంతో అప్పులు చేసి మ‌రి కొత్త‌ ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్ పెడ‌తారు.. కానీ మ‌ధ్య‌లోనే అది నిలిచిపోతుంది. అదే స‌మ‌యంలో.. మ‌నోహ‌ర్ జీవితంలోకి ఉమా దేవి ఎంట్రీ ఇస్తుంది. అమె ఎవ‌రు అమెకు మ‌నోహ‌ర్‌కు మ‌ధ్య రిలేష‌రన్ ఎంట‌నే ఆస‌క్తిక‌ర‌ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ఆద్యంతం కామెడీతో సాగుతూ ఓ మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!' ఈ రోజు మార్చి 29 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో సినిమాను మిస్స‌యిన వారు ఇప్పుడే ఈ సినిమాను కుటుంబ‌స‌మేతంగా చూసి హ‌యిగా అస్వాదించొచ్చు.


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM