లవ్ మి - ఇఫ్ యు డేర్ మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Thu, Mar 28, 2024, 08:10 PM

రౌడీ బాయ్స్‌లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి – ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 25న విడుదల కానుంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క మొదటి సింగిల్ ని రావాలి రా అనే టైటిల్ తో మార్చి 30న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


వైష్ణవి చైతన్య, ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM