4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్

by సూర్య | Thu, Mar 28, 2024, 05:10 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని జరగండి అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ లో 4.33 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. 2024 సమ్మర్‌లో ఈ సినిమా పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'కృష్ణమ్మ' బుకింగ్స్ Thu, May 09, 2024, 04:16 PM
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Thu, May 09, 2024, 04:11 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ నాన్ USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 09, 2024, 04:09 PM
50 రోజుల కౌంట్‌డౌన్‌లో థియేటర్లలోకి రానున్న 'కల్కి 2898 AD' Thu, May 09, 2024, 04:07 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థీమ్ సాంగ్ విడుదలకి తేదీ లాక్ Thu, May 09, 2024, 03:57 PM