'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థీమ్ సాంగ్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Thu, May 09, 2024, 03:57 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క థర్డ్ సింగల్ ని బాడ్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి థీమ్ అనే టైటిల్ తో మే 10న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 17, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో పార్వతిగా లేడీ సూపర్ స్టార్ Mon, May 20, 2024, 02:11 PM
తొలిసారి ఓటేసిన అక్షయ్ కుమార్ Mon, May 20, 2024, 02:11 PM