ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన 'ఆవేశం'

by సూర్య | Thu, May 09, 2024, 03:55 PM

మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ నటించిన 'ఆవేశం' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఈ ఘనత సాధించిన 7వ మాలీవుడ్ చిత్రంగా నిలిచింది. జిత్తు మాధవన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 9, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ చిత్రంలో హిప్‌స్టర్, రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సౌండ్‌ట్రాక్ అందించారు.

Latest News
 
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ యామీగౌతమ్ Mon, May 20, 2024, 04:56 PM
నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్ Mon, May 20, 2024, 04:54 PM
బేబీ బంప్ తో దీపికా పదుకొనే Mon, May 20, 2024, 04:20 PM
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM