మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కమిటీ కుర్రోళ్లు' టీమ్

by సూర్య | Thu, May 09, 2024, 04:11 PM

నిహారిక కొణిదెల తన యాక్టింగ్ కెరీర్‌తో పాటు వెబ్ సిరీస్‌లు మరియు షార్ట్ ఫిల్మ్‌లను కూడా నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు నిహారిక వెండితెరకు కొత్త ముఖాలను పరిచయం చేస్తూ తన తొలి చలన చిత్రాన్ని ప్రారంభించనుంది. ఈ సినిమాకి 'కమిటీ కుర్రోళ్లు' అనే టైటిల్‌ ని లాక్ చేసారు.


ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విశిక, మరియు షణ్ముకి నాగుమంత్రి కీలక పాత్రలో నటిస్తున్నారు.


ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. వెంకట సుభాష్ చీర్ల, కొండల్ రావు అడ్డగళ్ల ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు.

శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌తో కలిసి నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంతో యధు వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'గుడ్ బ్యాడ్ అగ్లీ' విడుదల ఎప్పుడంటే...! Mon, May 20, 2024, 01:43 PM
'ఆ ఒక్కటి అడక్కు' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Mon, May 20, 2024, 01:41 PM
'మిరాయి' నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ అవుట్ Mon, May 20, 2024, 01:39 PM
1 సంవత్సరం పూర్తి చేసుకున్న 'బిచ్చగాడు 2' Mon, May 20, 2024, 01:37 PM
'ఇండియన్ 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, May 20, 2024, 01:35 PM