కాంతారా హీరోతో జూ.ఎన్టీఆర్

by సూర్య | Mon, Mar 04, 2024, 02:40 PM

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో బాగా వైర‌ల్ అవుతోంది. అది జూ.ఎన్టీఆర్, కాంతారా హీరో రిష‌బ్ షెట్టి ఇంకా కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్  ఫ్యామిలీస్‌తో క‌లిసి దిగిన ఈ ఫొటో రెండు రోజుల నుంచి బాగా ట్రెండ‌వుతోంది. అయితే ఎన్టీఆర్  ప్ర‌స్తుతం దేవ‌ర సినిమా చేస్తుండ‌గా త‌న త‌దుప‌రి చిత్రం ప్ర‌శాంత్ నీల్‌తో ఉంటుంద‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆ సినిమా క‌థా చ‌ర్చ‌ల కోసం వారు క‌లిశారంటూ నెట్టింట‌ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే వారంతా బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో పాల్గొన్నార‌ని అంత‌కు మించి ఏమీ లేద‌ని తెలియ‌వ‌చ్చింది.ఇదిలాఉండ‌గా జూ. ఎన్టీఆర్ దేవ‌ర చిత్రం పార్ట్ 1పూర్తి చేశాక బాటీవుడ్ చిత్రం వార్ 2కు డేట్స్ కేటాయించ‌డంతో మ‌రో 6 నెల‌ల పాటు ఆ సినిమా షూటింగ్‌లోనే పాల్గొన‌నున్నాడు.అదేవివిధంగా తాజాగా స‌లార్  వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన‌ ప్ర‌శాంత్‌ నీల్ ఈ ఏప్రిల్‌లో నే స‌లార్ పార్ట్‌2 షూటింగ్ ప్రారంభించ‌నున్నట్లు స‌మాచారం. దీంతో జూ. ఎన్టీఆర్ ,ప్ర‌శాంత్ నీల్ చిత్రం ఈ ఏడాది చివ‌ర‌లో ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలుస్తోంది. ఇక కాంతార వంటి హిట్ త‌ర్వాత రిష‌బ్ షెట్టి  కాంతారా 2ను పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షూటింగ్ కాస్త విరామం ఇచ్చారు.ఈ క్ర‌మంలో వీకెండ్‌లో ప్ర‌శాంత్ నీల్ ఇంట్లో జ‌రిగిన చిన్న పార్టీకి రిష‌బ్ కూడా హ‌జ‌రై ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్, నిర్మాతలు హోంబ‌లే ఫిలింస్‌ విజ‌య్ కిరంగ‌దూర్‌, మైత్రీ మూవీస్  య‌ల‌మంచ‌లి ర‌వి కిశోర్‌ల‌తో క‌లిసి ఇలా ఫొటోల‌కు పోజులిచ్చారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లోకి వ‌చ్చేయ‌డంతో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM