మార్చి 4న ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ విడుదల

by సూర్య | Mon, Mar 04, 2024, 02:41 PM

హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’  సినిమా టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ను మార్చి 4న సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ కానుందనే ఇండికేషన్స్ అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తున్నాయంటే.. మేకర్స్ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక టీజర్ తర్వాత ఈ ‘ఫ్యామిలీ స్టార్’పై మరింతగా అంచనాలు పెరగడం ఖాయమని యూనిట్ చెబుతోంది. 

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM