శోభ శెట్టి కొత్త బిజినెస్

by సూర్య | Fri, Mar 01, 2024, 10:30 AM

శోభ శెట్టి సీరియల్స్ లో కనిపించడం లేదు. బిగ్ బాస్ షో అనంతరం ఆమె నటన పట్ల ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆలోచనలు అమలులో పెట్టడం స్టార్ట్ చేసింది. శోభ శెట్టి మోనితగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఆమె పలు సీరియల్స్ లో నటించినప్పటికీ కార్తీక దీపం ఫేమ్ తెచ్చిపెట్టింది. లేడీ విలన్ గా ఆ సీరియల్ లో శోభ శెట్టి నటన పీక్స్ అని చెప్పాలి. కార్తీక దీపం సక్సెస్ లో శోభ శెట్టి పాత్ర ఎంతగానో ఉంది. తాజాగా కార్తీక దీపం 2 ప్రకటించారు. మొదటి భాగంలో ప్రధాన పాత్రలు చేసిన నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ తిరిగి నటిస్తున్నారు. అయితే శోభ శెట్టికి ఛాన్స్ దక్కలేదు. కార్తీక దీపం 2లో మోనిత పాత్ర లేదని సమాచారం. విడుదలైన ప్రోమోల్లో కూడా మోనిత ప్రస్తావన లేదు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక శోభ శెట్టి ఒక టాక్ షో చేస్తుంది. సుమన్ టీవీలో కాఫీ విత్ శోభ శెట్టి పేరుతో ఈ టాక్ షో ప్రసారం అవుతుంది. పలువురు సెలెబ్స్ ని ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఎలాంటి సీరియల్స్ ఒప్పుకోలేదు. ఆమె ఒక మేకప్ స్టూడియో పెట్టింది. తనకు మేకప్ పై అవగాహన ఉన్న నేపథ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించాలని ఆమె భావిస్తున్నారు. తాజాగా మరో బిజినెస్ స్టార్ట్ చేసింది. ప్రియుడు సూరత్ వెళ్లిన శోభ శెట్టి అక్కడ హోల్ సేల్ కి చీరలు కొన్నది. ఆ చీరలు తన మేకప్ స్కూల్ వచ్చే కస్టమర్స్ కి అమ్మాలి అనుకుంటుందట. రిటైల్ అండ్ హొల్ సేల్ గా చీరలు అమ్మాలని ఆమె నిర్ణయం తీసుకుందట. ఈ క్రమంలో నటనకు గుడ్ బై చెప్పిన శోభ శెట్టి బిజినెస్ పై దృష్టి పెట్టింది. సీరియల్స్ లో నటించడం వలన వచ్చే ఆదాయం తక్కువే కాబట్టి... బిజినెస్ బెటర్ అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఒక యూట్యూబ్ ఛానల్ ఆమె రన్ చేస్తుంది...  నిజంగా శోభ శెట్టి నటన మానేస్తే ఆమె అభిమానులు బాధపడే అవకాశం ఉంది. కాగా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న శోభ శెట్టి 14 వారాలు హౌస్లో ఉంది. అయితే అత్యంత నెగిటివిటీ మధ్య ఆమె బయటకు వచ్చింది. 


 


 

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM