DNSని నార్త్ అమెరికాలో విడుదల చేయనున్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌసేస్

by సూర్య | Mon, Feb 26, 2024, 07:56 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా D51 అనే పేరును పెట్టారు. ఈ యాక్షన్ డ్రామాకి 'ధారవి' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ముంబైలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా కనిపించనున్నట్లు సమచారం.


ముంబయిలోని ధారవిలో మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రత్యంగిరా మరియు AA క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM