'హనుమాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు

by సూర్య | Wed, Feb 21, 2024, 02:21 PM

పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో సినిమా 'హను-మాన్' లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం జనవరి 12, 2024న వెండితెరపైకి వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు వసూళ్లు చేసింది.

హనుమాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం మార్చి 2,2024న OTT ప్లాట్‌ఫారమ్ జీ5లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో  వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.


అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హను-మాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM