'బడే మియాన్ చోటే మియాన్‌' తెలుగు వెర్షన్ టైటిల్ ట్రాక్ అవుట్

by సూర్య | Wed, Feb 21, 2024, 02:18 PM

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ ఒక మల్టీస్టారర్ మూవీని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బడే మియాన్ చోటే మియాన్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


తాజాగా మూవీ మేకర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ యొక్క టైటిల్ ట్రాక్ తెలుగు వెర్షన్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం 2024 ఈద్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని, వాసు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్ మరియు అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM