నేడు విడుదల కానున్న భీమాలోని 'గల్లీసౌందుల్లో' లిరికల్ సాంగ్

by సూర్య | Wed, Feb 21, 2024, 02:30 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా నుండి గల్లీసౌందుల్లో లిరికల్ సాంగ్ ని ఈరోజు సాయంత్రం 5:04 గంటలకి విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి మూవీ మేకర్స్ ప్రకటించారు.


ఈ చిత్రం మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM