'బబుల్‌గమ్' నుండి జాను సాంగ్ అవుట్

by సూర్య | Wed, Dec 06, 2023, 04:58 PM

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మరియు ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే. రవికాంత్ పెరుపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'బబుల్‌గమ్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మూడవ సింగల్ ని జాను అనే టైటిల్ తో విడుదల చేసారు. అనంత శ్రీరామ్ ఈ సాంగ్ కి సాహిత్యం అందించగా శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసారు. జావేద్ అలీ శ్రావ్యంగా పాడిన ఈ మాంటేజ్ ట్రాక్ భావోద్వేగాన్ని విజయవంతంగా తెలియజేస్తుంది.

ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 29, 2023న విడుదల కానుంది. హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి మరియు ఇతరులు ఈ సినిమాలో  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ బబుల్‌గమ్‌ను నిర్మించింది.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM