మరో రెండు రోజులలో 'జిగర్తాండ డబుల్ ఎక్స్' డిజిటల్ ఎంట్రీ

by సూర్య | Wed, Dec 06, 2023, 04:55 PM

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నటులు రాఘవ లారెన్స్ మరియు SJ సూర్య నటించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' సినిమా నవంబర్ 10న తమిళం, తెలుగు మరియు హిందీలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


ఈ చిత్రం డిసెంబర్ 8, 2023న నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తెలుగు నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించింది.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM