'హాయ్ నాన్నా' నుండి ఇదే ఇదే సాంగ్ అవుట్

by సూర్య | Wed, Dec 06, 2023, 04:54 PM

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'హాయ్ నాన్నా' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమా డిసెంబర్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఐదవ పాట 'ఇదే ఇదే' అనే టైటిల్ తో విడుదల చేసారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ ట్రాక్ ని కంపోజ్ చేసి దానికి తన గాత్రాన్ని అందించాడు.

ఈ పాన్-ఇండియన్ చిత్రంలో బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి, శ్రుతి హాసన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM