'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' ని కర్ణాటక లో విడుదల చేస్తున్న ప్రముఖ ప్రొడక్షన్ హౌస్

by సూర్య | Wed, Dec 06, 2023, 04:52 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో నితిన్ తన 32వ చిత్రాన్ని రచయిత-దర్శకుడు వక్కంతం వంశీతో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌' అనే టైటిల్‌ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాని కర్ణాటక రీజియన్ లో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరి కొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

డిసెంబర్ 8, 2023న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ యాక్షన్ ఫిల్మ్‌లో నితిన్‌కి జోడిగా శ్రీలీల నటించనుంది. రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నితిన్ 32ని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM