మరోసారి త్రిషతో జతకట్టనున్న మెగాస్టార్

by సూర్య | Wed, Dec 06, 2023, 11:48 AM

చిరంజీవి - త్రిష.. ఇద్దరూ కలసి ‘స్టాలిన్‌’లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత ఈ జోడీని మళ్లీ సిల్వర్‌ స్ర్కీన్‌పై చూసే అవకాశం రాలేదు. ఇంత కాలానికి వీరిద్దరూ జంటగా దర్శనమివ్వబోతున్నారని టాక్‌. చిరంజీవి - వశిష్ట కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు సరసన ఐదుగురు కథానాయికలు కనిపించబోతున్నారు. అందులో ఓ కథానాయికగా త్రిష ఎంపిక ఖాయమైందని సమాచారం. నిజానికి త్రిష పాత్రలో ముందుగా అనుష్క పేరు పరిశీలించారు. చివరికి త్రిషని ఫైనల్‌ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో త్రిష దేవకన్యగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ తరహా పాత్ర త్రిష ఇంత వరకూ చేయలేదు. అందుకే కథ విన్న వెంటనే ‘ఓకే’ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో నలుగురు కథానాయికలు ఎవరన్నది తెలియాల్సివుంది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే పేరు పరిశీలిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Latest News
 
'భూల్ భూలయ్యా 3' రన్ టైమ్ లాక్ Thu, Oct 24, 2024, 05:37 PM
చీరలో శోభితా ధూళిపాలా Thu, Oct 24, 2024, 05:34 PM
'మట్కా' సెకండ్ సింగల్ అవుట్ Thu, Oct 24, 2024, 05:30 PM
జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు Thu, Oct 24, 2024, 05:24 PM
హైదరాబాద్‌లో డాల్బీ విజన్ థియేటర్‌ను ప్రారంభించనున్న అల్లు అరవింద్ Thu, Oct 24, 2024, 05:13 PM