సక్సెస్‌, ఫెయిల్యూర్‌ కామన్ . వాటిని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం

by సూర్య | Wed, Dec 06, 2023, 11:47 AM

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘దూత’ వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్నారు నాగచైతన్య. ఈ నెల 1న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చిన ఈ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది. దీంతో రిలాక్స్‌ అయిన నాగచైతన్య తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఫ్లాప్‌ గురించి మాట్లాడారు. ఆ సినిమా ప్రేక్షకాదరణ పరాజయం కావడం బాధ కలిగించలేదన్నారు.ఆయన మాట్లాడుతూ ‘‘దూత’లో నా పాత్రకు జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయి. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఫ్లాప్‌ అవుతుందని నాకు ముందే తెలిసినా.. కచ్చితంగా ఈ సినిమా చేసేవాడిని. ఎందుకంటే ఆ సినిమాలో నేను ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటిస్తాను కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా అంగీకరించేవాడిని. ఆయనతో నటించి నేను చాలా విషయాలు తెలుసుకున్నా. అందుకే దాని ఫలితం నాకు బాధ కలిగించలేదు. ఆ చిత్రంలో భాగమైనందుకు ఇప్పటికీ ఆనందంగా ఉన్నా. అయినా జీవితంలో చాలా ఒడుదొడుకులు ఉంటాయి. అలాగే సినిమాల విషయంలోనూ సక్సెస్‌, ఫెయిల్యూర్‌ కామన్ . వాటిని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలంతే’’ అని అన్నారు. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌’లో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయిక. వలస మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తారు.

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM
వాయిదా పడిన 'జీబ్రా' విడుదల Thu, Oct 24, 2024, 07:26 PM