వాయిదా పడిన 'జీబ్రా' విడుదల

by సూర్య | Thu, Oct 24, 2024, 07:26 PM

తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ జీబ్రా అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ ప్రధాన పాత్రలో ఒకరు. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లో విడుదల కానుంది అని గతంలో మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడి చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మల్టీ స్టారర్‌కి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రియా భవానీ శంకర్ మరియు జెన్నిఫర్ పిక్కినాటో మహిళా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు సత్యరాజ్, సత్య ఆకల, సునీల్, ప్రియా భవాని శంకర్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రాఫర్ కాగా  మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటింగ్ చూసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. 

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM