'సాలార్‌'లో ప్రభాస్ ఎంట్రీపై ఆసక్తికరమైన బజ్

by సూర్య | Mon, Dec 04, 2023, 07:45 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. డిసెంబర్ 1న ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ వైరల్‌గా మారి ప్రేక్షకులలో క్యూరియాసిటీ లెవల్స్‌ను పెంచింది. ట్రైలర్‌లో ప్రభాస్ చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడంతో ఒక వర్గం అభిమానులు టీజర్ పట్ల సంతోషించలేదు. ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ కూడా కాస్త లేట్ అవుతుందనే వార్త వైరల్ గా మారింది.

ఈ సినిమా ప్రారంభమైన అరగంట వరకు చైల్డ్ ఎపిసోడ్‌లు ఉంటాయని, ఆపై పృథివీరాజ్‌కి సంబంధించిన సన్నివేశాలను ప్రదర్శిస్తారని గాసిప్ ఉంది. ఇదంతా జ‌రిగిన త‌ర్వాతనే ప్ర‌భాస్ ఎంట్రీ ఇస్తాడ‌ని లేటెస్ట్ టాక్. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ  సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM