మీ పెర్ఫార్మెన్స్ జీవితాంతం గుర్తుండిపోతుంది

by సూర్య | Mon, Dec 04, 2023, 11:59 AM

రణ్‌బీర్ కపూర్  హీరోగా సందీప్ రెడ్డి వంగా  దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘యానిమల్’. ప్రమోషనల్ కంటెంట్‌తోనే సినిమాపై బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇందులో ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు జోడీగా నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా నటించగా.. స్టార్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమాని చూసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు. ‘‘రణ్‌బీర్ కపూర్.. మీలోని మాస్ సూపర్‌స్టార్ ఈ యానిమల్‌తో బయటికొచ్చాడు. మీ పెర్ఫార్మెన్స్ జీవితాంతం గుర్తుండిపోతుంది. రష్మిక మందన్నా.. ఇప్పటి వరకు మీరు చేసిన పాత్రలలో బెస్ట్ పాత్ర ఇదేనని భావిస్తున్నాను. సెకండాఫ్‌లో వచ్చే గొడవ సన్నివేశం నాకు బాగా నచ్చింది. ఆ సీన్‌ని అద్భుతంగా చిత్రీకరించారు. సందీప్ వంగా.. మీరు మాత్రమే ఇటువంటి సన్నివేశాలను ఊహించగలరు. మీరు సృష్టించిన ట్రాన్స్ నుంచి బయటికి రావడానికి చాలా టైమ్ పట్టింది’’ అని కార్తికేయ తన ట్విట్టర్‌లో ‘యానిమల్’ సినిమాపై రియాక్ట్ అయ్యారు. 

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM