'సాలార్' అడ్వాన్స్ బుకింగ్స్ కి తేదీ లాక్

by సూర్య | Sun, Dec 03, 2023, 01:23 PM

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా సాలార్ థియేట్రికల్ ట్రైలర్ విడుదలై అభిమానుల నుండి మంచి స్పందనను సొంతం చేసుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆల్ టైమ్ హైకి తీసుకువెళ్లింది మరియు ఇప్పుడు అందరి దృష్టి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పైనే ఉంది.


తాజా అప్‌డేట్‌ ప్రకారం, ఈ సినిమా ప్రీ-సేల్స్ డిసెంబర్ 15 నుండి భారతదేశం అంతటా ప్రారంభం కానున్నాయి అని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ భారీ సినిమా యొక్క బుకింగ్‌లు ఖచ్చితంగా భారతీయ సినిమా చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తాయి అని లేటెస్ట్ టాక్. సాలార్ డిసెంబర్ 22న థియేటర్లలోకి రానుంది.


ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి KGF ఫ్రాంచైజీ ఫేమ్ రవి బాసురుర్ సంగీత స్వరకర్త.హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM