సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'హాయ్ నాన్నా'

by సూర్య | Sun, Dec 03, 2023, 01:26 PM

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన రాబోయే పాన్-ఇండియన్ చిత్రం 'హాయ్ నాన్నా' సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, హాయ్ నాన్నా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ చిత్రంలో శృతి హాసన్, బేబీ కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరామ్ మరియు ఇతరలు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7, 2023న పలు భాషల్లో విడుదల కానుంది.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM