నేడు అమెజాన్ ప్రైమ్ లో సందడి చేసిన గ‌రుడ‌న్

by సూర్య | Fri, Dec 01, 2023, 05:11 PM

మ‌రో ఆసక్తిక‌ర‌మైన చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సైలెంట్‌గా వ‌చ్చేసింది. మ‌ళ‌యాళంలోనే కాకుండా తెలుగులో త‌న డ‌బ్బింగ్ చిత్రాల‌తో సూప‌ర్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ఆగ్ర‌న‌టుడు సురేశ్‌గోపి, ఖ‌త‌ర్నాక్‌, ర‌ణం, అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ సినిమాల‌తో తెలుగు వారికి ప‌రిచ‌యం అయిన బీజుమీన‌న్ ఇద్ద‌రు క‌లిసి న‌టించిన క్యాట్, అండ్ మౌస్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గ‌రుడ‌న్ . గ‌త సంవ‌త్స‌రం పాప్ప‌న్ చిత్రంలో హిట్ కొట్టి సోలో హీరోగా మ‌రోసారి ఫామ్‌లోకి వ‌చ్చిన సురేశ్‌గోపి దాదాపు 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌రో అగ్ర న‌టుడు బిజూమీన‌న్ తో క‌లిసి న‌టించిన చిత్రం గ‌రుడ‌న్ న‌వంబ‌ర్ 3న విడుద‌లై మంచి టాక్‌తో 5 వారాలైన విజ‌య‌వంతంగా న‌డుస్తూ కేర‌ళ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది.నూత‌న ద‌ర్శ‌కుడు అరుణ్ వర్మ తెర‌కెక్కించిన ఈ సినిమా కేర‌ళ‌లో ఈ సంవ‌త్స‌రం హ‌య్యెస్ట్ గ్రాస్‌డ్ సినిమాల‌లో ఒక‌టిగా నిలిచింది. కేవ‌లం రూ.7 కోట్ల‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ.30 కోట్ల‌ను రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించడం విశేషం. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ సినిమాను నిర్మించ‌గా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. ఇంకా ఈ చిత్రంలో సిద్ధిక్, దిలీష్ పోతన్, మేజర్ రవి, తలైవాసల్ విజయ్, అర్జున్ నందకుమార్, దివ్య పిళ్లై, సంతోష్ కీశతుర్, బాలాజీ శర్మ, మాళవిక, రంజిత్ కంగోల్, జేసీ జోస్, జోసుకుట్టి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అయితే ఈ సినిమాను ఉన్న‌ట్టుండి సైలెంట్‌గా ఓటీటీలోకి తీసుకు వ‌చ్చేశారు. శుక్ర‌వారం(డిసెంబ‌ర్ 1) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మ‌ళ‌యాళం భాష‌లో స్ట్రీమింగ్ జ‌రుగుతున్న‌ది. త్వ‌ర‌లో తెలుగులోనూ రానుంది. నిజాయితీ గ‌ల ఓ పోలీస్ అధికారి, కాలేజీ ప్రొపెస‌ర్‌లు ఓ హ‌త్యా నేరంలో చిక్కుకోగా అందులో నుంచి బ‌య‌ట ప‌డే క్ర‌మంలో చిత్త‌శుద్ధి కోసం ఒకరు, న్యాయం కోసం కోసం మరొకరు ఎలా పోరాటం చేశార‌నే క‌థా నేప‌థ్యంలో సినిమా ఆధ్యంతం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తుంది.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM