చిత్రపరిశ్రమలో మత కుల భేదాలు లేవని ఈ సినిమా నిరూపించింది

by సూర్య | Fri, Dec 01, 2023, 05:11 PM

చిత్రపరిశ్రమలో మాత్రమే జాతి మత కుల భేదాలు లేవని అన్నారు కోలీవుడ్ దర్శకుడు పేరరసు. శ్రీ ఆండాల్‌ మూవీస్‌ పతాకంపై పి. వీర అమృతరాజ్‌ నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్‌ జె. రాజా మొహ్మద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మునియాండియిన్‌ మునిప్పాయిస్సల్‌’. జయకాంత్‌ హీరో. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు పేరరసు, ఆర్‌వీ ఉదయకుమార్‌తో పాటు చిత్ర యూనిట్‌ పాల్గొనింది. ఈ సందర్భంగా పేరరసు మాట్లాడుతూ... ‘‘కులమత జాతిభేదాలు లేనిది చిత్ర పరిశ్రమ. దీనికి నిదర్శనం.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఒక ముస్లిం టెక్నీషియన్‌. జయకాంత్‌ - రాజా మొహ్మద్‌లను చూస్తుంటే నాకు విజయకాంత్‌ - ఇబ్రహీం రౌథర్‌ కాంబినేషన్‌ గుర్తుకు వస్తోంది. విజయకాంత్‌ విజయంలో ఇబ్రహీం పాత్ర కీలకం. వారిద్దరి మధ్య కులమత భేషజాలు లేవు. విరుదునగర్‌ వంటి ప్రాంతాల్లో మునియాండికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కులదైవానికి మనమే పూజలు చేయొచ్చు’’ అని పేర్కొన్నారు.చిత్ర దర్శకుడు రాజా మొహ్మద్‌ మాట్లాడుతూ... ‘‘నిర్మాత వీర అమృతరాజ్‌, ఆయన సతీమణి తిలగవతి లేకుండా ఈ మూవీ లేదు. నాకు తెలిసి 365 రోజుల పాటు మేకపోతును బలిచ్చి పూజలు జరిగే ఆలయం మునియాండి ఆలయం మాత్రమే. ఈ విషయంలో కొందరికి నమ్మకం ఉంటుంది. మరికొందరికి ఉండకపోవచ్చు. హీరో జయకాంత్‌కు, నాకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించాం’’ అని అన్నారు. హీరో జయకాంత్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రం షూటింగ్‌ పాండి ఆలయంలో పూర్తి చేశాం. ఈ సినిమా మంచి సక్సెస్‌ సాధించాలని పాండి ఆలయంలో నేను, దర్శకుడు వేడుకున్నామని అన్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM