చిత్ర పరిశ్రమలో విషాదం

by సూర్య | Fri, Dec 01, 2023, 05:09 PM

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్‌ నటి ఆర్ సుబ్బలక్ష్మి (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు సౌభాగ్య సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘నా బలం, మా అమ్మమ్మను నేను కోల్పోయాను’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఆమెకు ఇద్దరు అమ్మాయికు, ఒక కుమారుడు ఉన్నారు. సుబ్బలక్ష్మి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతోపాటు సంస్కృతంలో కూడా ఓ సినిమా చేశారు. తెలుగులో వేణు తొట్టెంపూడి నటించిన ‘కళ్యాణ రాముడు’ సినిమాలో బామ్మ పాత్రలో కనిపించారు, నాగచైతన్య ‘ఏ మాయ చేసావె’లో సమంతకు అమ్మమ్మగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా ‘బీస్ట్‌’ సినిమాలో సుబ్బలక్ష్మి కనిపించారు. ఏక్‌ దీవానా తా, దిల్‌ బేచారా చిత్రాలతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించారు. మొత్తం మీద 70కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా ఆమె సందడి చేశారు. ఎన్నో సీరియళ్లలో నటించి ఆకట్టుకున్నారు. సినీ పరిశ్రమలోకి రాకముందు జవహర్‌ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. 1951లో ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగం చేశారు. సౌత ఇండియా నుంచి ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు సృష్టించారు. అంతే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకున్నారు. సుబ్బలక్ష్మీ మరణవార్త తెలుసుకుని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM