హవా సాగిస్తున్న 'యానిమల్‌'

by సూర్య | Fri, Dec 01, 2023, 05:12 PM

తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి’తో యావత్  ప్రేక్షక లోకాన్ని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఆ చిత్రాన్నే హిందీలో కబీర్‌సింగ్‌ పేరుతో రీమేక్‌ చేసి మరో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కొంతగ్యాప్‌ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా 'యానిమల్‌'  చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రారంభం నుంచే ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. బాలీవుడ్‌తోపాటు ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు(డిసెంబర్‌ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీ సిరీస్‌ భూషణ్‌కుమార్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. మరి ఫస్ట్‌ షో చూసిన వారు అభిప్రాయం, సోషల్‌ మీడియా ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లు ఏమంటున్నారో ఓ లుక్కేద్దాం.ఎక్స్‌(ట్విట్టర్‌)లో సినిమాకుఉ స్పందన అయితే బావుంది. రణ్‌బీర్‌, అనిల్‌ కపూర్‌, రష్మిక, బాబీ దేవోల్‌ నటన అదిరిపోయిందంటున్నారు. అయితే వయోలెన్స్‌ కాస్త ఎక్కువైందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. సినిమాలో డ్రామా ఎవర్‌గ్రీన అని, క్లైమాక్స్‌ పీక్స్‌ అని ఓ నెటిజెన్  కామెంట్‌ చేశాడు.రణ్‌బీర్‌ క్యారెక్టర్‌లో ఇంటెన్సిటీ , సౌండ్‌ డిజైనింగ్‌, విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి చిత్రాలు తీసే దర్శకులు జనరేషన్ కి ఒకరు మాత్రమే ఉంటారు. సందీప్‌ రాక్స్‌ అని ఓ నెటిజెన్ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. రణ్‌బీర్‌ కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ అని, బ్లాక్‌బస్టర్‌హిట్‌, పక్కా పైసా వసూల్‌ సినిమా అని చెబుతున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఖాయమని, ఓ నెటిజెన్ 3.5 రేటింగ్‌ ఇచ్చాడు. సినిమాలో ప్రతి అంశం నెక్ట్స్‌ లెవల్లో ఉందని ఓ విమర్శకుడు తెలిపాడు. ఓవరాల్‌గా ట్విట్టర్‌లో నెటిజన్ల హవా చూస్తుంటే 'యానిమల్‌' పెద్ద హిట్‌లాగానే కనిపిస్తోంది.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM