తండ్రీ కూతుళ్ల అనుబంధం చూపించేదే ఈ సినిమా

by సూర్య | Fri, Dec 01, 2023, 05:05 PM

‘‘జనవరి మనందరి సినిమా పండగ. అయితే ఈ డిసెంబరులో సంక్రాంతి ముందే వచ్చేస్తోంది. ఈనెలంతా మంచి సినిమాలు రాబోతున్నాయి. అందులో ‘హాయ్‌ నాన్న’ కూడా ఉంద’’న్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. డిసెంబరు 7న విడుదల అవుతోంది. ఇటీవల విశాఖపట్నంలో ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. నాని మాట్లాడుతూ ‘‘విశాఖ అంటే నాకు ప్రత్యేక అభిమానం. క్లాస్‌, మాస్‌ అనకుండా నా సినిమాల్నీ ఒకేలా ఆదరించారు. ‘ఈ సినిమాతో నాని ఏడిపించేస్తాడేమో’ అనే డౌటు వద్దు. కళ్లనిండా ఆనంద భాష్పాలు కురిపించే సినిమా ఇదన్నారు. ‘‘ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల అనుబంధం చాలా గొప్పగా చూపించారు. సినిమా మొదలైన కాసేపటికే వాళ్లతో ప్రేమలో పడిపోతార’’న్నారు మృణాల్‌ ఠాకూర్‌.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM