'ఎటో వెళ్లిపోయింది మనసు' సాంగ్ లిరిక్స్

by సూర్య | Wed, Nov 29, 2023, 11:25 AM

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురియ్యలేవా ఏమైందో

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురియ్యలేవా ఏమయిందో
ఏమయిందో ఏమయిందో

ఏ స్నేహమూ కావాలని
ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని
నాకెవ్వరు చెప్పలేదు

చెలిమి చిరునామా తెలుసుకోగానే
రెక్కలొచ్చాయో ఏమిటో

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురియ్యలేవా ఏమైందో

కలాలన్నవి కొలువుండని
కనులుండి ఏం లాభమంది
ఏ కదలికా కనిపించని
శిలలాంటి బ్రతుకెందుకంధీ

తోడు ఒకరంటే జీవితం ఏంతో
వెడుకౌతుంది అంటూ

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురియ్యలేవా ఏమైందో

Latest News
 
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...! Fri, Sep 20, 2024, 05:25 PM
'కళింగ' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 20, 2024, 05:21 PM
బిగ్ బాస్ 8 తెలుగు : విష్ణుప్రియపై ప్రేరణ కీలక వ్యాఖ్యలు Fri, Sep 20, 2024, 05:17 PM
'రక్త బ్రహ్మాండం' షూటింగ్ ప్రారంభించిన సమంత Fri, Sep 20, 2024, 05:13 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM