డెవిల్ : 'దిస్ ఈజ్ లేడీ రోజీ' కి భారీ స్పందన

by సూర్య | Tue, Nov 28, 2023, 08:46 PM

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'డెవిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. చిత్ర బృందం హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోస్ చేసిన డెవిల్ యొక్క రెండవ సింగల్ ని  'దిస్ ఈజ్ లేడీ రోజీ' ని విడుదల చేసారు.


తాజగా ఇప్పుడు, ఈ సాంగ్ యూట్యూబ్ లో 1.5 మిలియన్ వీక్షణలను సంపాదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ స్పై థ్రిల్లర్ డెవిల్ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ జోడిగా కనిపించనుంది.


ఈ చిత్రం నవంబర్ 24, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అభిషేక్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో కళ్యాణ్ రామ్ ఒక చీకటి రహస్యాన్ని ఛేదించే లక్ష్యంతో నిర్భయ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM