దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...?

by సూర్య | Thu, Sep 19, 2024, 10:17 PM

దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫాన్స్. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్సయింది. మూవీ రిలీజ్ కంటే ముందు ఏ హీరో అభిమాని అయినా.. ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంటారు. దేవర రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రీరిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. మొత్తానికి ఈ ఈవెంట్ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 22) జరగబోతోంది.


దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి గురువారం (సెప్టెంబర్ 19) మేకర్స్ వెల్లడించారు. దేవర మూవీ అఫీషియర్ ఎక్స్ అకౌంట్ ప్రీరిలీజ్ గురించి చెబుతూ.. "వాళ్ల డెమీగాడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సముద్రమంతటి అభిమానుల కోసం.. అతడు కూడా మిమ్మల్ని చూడటానికి ఆతృతగా ఉన్నాడు. మనం ప్రేమ వరదను మోసుకొద్దాం. 22న కలుద్దాం" అనే క్యాప్షన్ ఉంచింది. ఇక దేవర మూవీని నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ కూడా ఇదే పోస్ట్ చేసింది. "బిగ్ స్క్రీన్స్ ను తాకే ముందే ఈ ఆవేశానికి స్వాగతం పలుకుదాం. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న. మరిన్ని వివరాలు త్వరలోనే.." అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. మరిన్ని వివరాలు త్వరలోనే అంటే.. అప్పుడే వెన్యూ వివరాలు కూడా తెలవనున్నాయి.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM