'హాయ్ నాన్నా' నుండి ఒడియమ్మ పార్టీ సాంగ్ అవుట్

by సూర్య | Tue, Nov 28, 2023, 08:36 PM

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'హాయ్ నాన్నా' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని నాల్గవ సింగిల్‌ను ఒడియమా అనే టైటిల్ తో విడుదల చేశారు. ఇంతకు ముందు కొన్ని మెలోడియస్ ట్యూన్స్ ఇచ్చిన హేషామ్ అబ్దుల్ వహాబ్ ఎలక్ట్రానిక్ బీట్‌లతో రాకింగ్ పార్టీ సాంగ్ ని చేసారు. ధృవ్ విక్రమ్ మరియు చిన్మయి శ్రీపాదతో పాటు కొన్ని చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను రూపొందించిన శృతి హాసన్ కూడా ఈ సాంగ్ కి స్వరాలు అందించారు. ధృవ్‌కి ఇదే తొలి తెలుగు పాట.

సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి, శ్రుతి హాసన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM