అల్లు అర్జున్ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యిందా !

by సూర్య | Sat, Mar 16, 2019, 11:53 AM

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభంకాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ముఖ్య పాత్రల ఎంపిక జరుగుతోంది.ఈ సినిమాకి 'నాన్న .. నేను' అనే టైటిల్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని త్రివిక్రమ్ వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా థియేటర్ కి రప్పించే అంశాలను త్రివిక్రమ్ జోడిస్తున్నట్టుగా చెబుతున్నారు. కథానాయికలుగా పూజా హెగ్డే .. కేథరిన్ ల పేర్లు వినిపిస్తున్నాయి. బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమా షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM