'లియో' ఓటీటీలో స్ట్రీమింగ్ పై గందరగోళం

by సూర్య | Tue, Nov 21, 2023, 04:11 PM

దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి తెలుగులో ఎక్కువ అభిమానులు వున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఇంతకు ముందు కమల్ హాసన్ తో 'విక్రమ్' , అంతకన్నా ముందు 'ఖైదీ' , 'మాస్టర్' లాంటి సినిమాలు చేసిన లోకేష్ తరువాత విజయ్ తో 'లియో' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్స్ లో విడుదలైంది, కానీ ఈ సినిమాకి మిశ్రమ స్పందన మాత్రమే వచ్చింది. తమిళంలో బాగా ఆడింది అని అంటున్నారు, కానీ తెలుగులో మాత్రం అంతగా నడవలేదు.త్రిష కథానాయకురాలు ఈ సినిమాలో, ఇతర ముఖ్య పాత్రల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్ నటించారు. ఈ సినిమా ఎప్పుడు ఓటిటి లో వస్తుందా అని అటు విజయ్ అభిమానులు, ఇటు లోకేష్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ముందుగా నవంబర్ 16 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది అనే వార్త వైరల్ అయింది, కానీ తరువాత ఆ వార్త తప్పని తేలింది. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఎప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయం సాంఘీక మాధ్యమంలో ప్రకటించింది. అయితే ఇందులో కూడా రెండు తేదీలు ప్రకటించి మరోసారి గందరగోళానికి తెరతీసింది. ఆ ప్రకటన ప్రకారం ఈ 'లియో' సినిమా ఇండియాలో నవంబర్ 24 న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఇక ప్రపంచం అంతటా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. తమిళం తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇలా రెండు తేదీలు ప్రకటించటంతో అభిమానులు కొంచెం గందరగోళానికి గురయ్యారు.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM