సంవత్సరం అంతా పాడుకునేలా 'గుంటూరు కారం’ పాటలుంటాయి

by సూర్య | Tue, Nov 21, 2023, 04:10 PM

మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం’ చిత్రానికి సంబంధించి నిర్మాత నాగవంశీ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన 'ఆదికేశవ’ చిత్రం ట్రైలర్‌ విడుదల వేదికపై 'గుంటూరు కారం' చిత్రం గురించి నిర్మాత నాగవంశీపై ప్రశ్నల వర్షం కురిపించారు అభిమానులు. ‘'గుంటూరు కారం’ సినిమా విడుదలకు సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికి ఒక్క పాటే విడుదల చేశారు. మిగిలిన పాటలు విడుదల చేయడానికి సమయం సరిపోతుందా?" అని అభిమానులు నాగవంశీని అడగగా ''ఇంకా మూడు పాటలు విడుదలకు ఉన్నాయి. అవి అందరికీ చేరువ కావడానికి సరిపడ సమయం ఉంది. ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. వచ్చే ఏడాదంతా పాడుకునేలా ఉంటాయి. వచ్చేవారం రెండో పాటను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. 

Latest News
 
SSMB29.. ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ Sun, Nov 09, 2025, 03:12 PM
'శివ' సినిమా నా పై తీవ్ర ప్రభావం చూపింది - ప్రభాస్ Sun, Nov 09, 2025, 02:58 PM
షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా బడ్జెట్ రూ.350 కోట్లకు చేరిక Sun, Nov 09, 2025, 02:34 PM
మోహన్ లాల్ 'వృషభ' సినిమా మళ్ళీ వాయిదా Sun, Nov 09, 2025, 02:06 PM
మరో వారంలో రాజాసాబ్‌ మొదటి సింగిల్ Sun, Nov 09, 2025, 02:01 PM