'గరుడవేగ-2' డైరెక్టర్ ఎవరబ్బా ....

by సూర్య | Wed, Mar 13, 2019, 01:33 PM

రెండేళ్లు వెనక్కి వెళ్తే సీనియర్ హీరో రాజశేఖర్ పరిస్థితి దయనీయంగా ఉండేది. ఆయన ఇండస్ట్రీలో ఉన్న సంగతి కూడా అందరూ మరిచిపోయారు. అప్పటికి ఆయన సినిమా రిలీజై కూడా చాలా ఏళ్లయిపోయింది. ఇక ఆయన్ని మళ్లీ తెరపై చూస్తామా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. అలాంటి తరుణంలో ప్రవీణ్ సత్తారు.. రాజశేఖర్‌తో ఓ సాహసోపేత సినిమా తీశాడు. అదే.. గరుడవేగ. ఈ చిత్రం రాజశేఖర్‌ కెరీర్‌కు మళ్లీ ఊపిరిలూదింది. ఆయన్ని మళ్లీ లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ‘కల్కి’ అనే మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు రాజశేఖర్. ఈ చిత్ర టీజర్ కూడా ఈ మధ్యే రిలీజైంది. ‘కల్కి’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. వేసవిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

ఇదిలా ఉంటే.. తాను ‘గరుడ వేగ’ సీక్వెల్లో కూడా నటిస్తున్నట్లు రాజశేఖర్ తాజాగా వెల్లడించడం విశేషం. రాజశేఖర్ తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ తరఫున ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో తాను ‘గరుడవేగ-2’ చేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపాడు. అంతకుమించి వివరాలేమీ వెల్లడించలేదు.

ఐతే ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ‘గరుడవేగ’ తర్వాత ప్రవీణ్ సత్తారు బిజీ అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ రామ్‌తో చేయాల్సిన ప్రాజెక్టు ఆగిపోయి.. ఇంకేదీ సెట్టవ్వక.. గోపీచంద్ బయోపిక్ సంగతి ఎటూ తేలక అయోమయంలో పడిపోయాడు ప్రవీణ్. అతడి తర్వాతి ప్రాజెక్టు గురించి ఏ సమాచారం లేదు. గోపీ బయోపిక్కే చేసేట్లయితే.. అతను దాని మీద చాలా కాలమే పని చేయాల్సి ఉంటుంది.

రాజశేఖర్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో కొత్త సినిమా కోసం అందుబాటులోకి వస్తాడు. అప్పటికి గోపీ బయోపిక్ కూడా మొదలవుతుందంటున్నారు. మరి దాన్ని విడిచిపెట్టి ప్రవీణ్ ఈ సినిమా చేస్తాడా.. లేక రాజశేఖర్ ఇంకెవరితో అయినా ఈ సినిమా చేస్తున్నాడా అన్నది చూడాలి. ‘గరుడవేగ’ కోసం రాజశేఖర్ సన్నిహితుడైన కోటేశ్వరరాజు రూ.25 కోట్ల దాకా తెచ్చి పోశాడు. మరి సీక్వెల్ కూడా అదే రేంజిలో చేయాలంటే.. ఇంకోసారి అంతేసి బడ్జెట్ పెట్టడానికి ఎవరు ముందుకొస్తారో చూడాలి.


 


 

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM