విడుదల తేదీని ఖరారు చేసిన 'ధృవ నచ్చతిరమ్'

by సూర్య | Sat, Sep 23, 2023, 08:57 PM

గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ అధికారకంగా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ధృవ నచ్చతిరమ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 24 నవంబర్ 2023న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. విడుదల తేదీని ప్రకటించేందుకు మూవీ మేకర్స్ 'ట్రైల్ బ్లేజర్' పేరుతో ఒక చిన్న ప్రోమోను విడుదల చేసారు. వీడియో కొన్ని అద్భుతమైన యాక్షన్ అంశాలతో నిండిపోయింది. ఈ సినిమాలో జాన్‌గా విక్రమ్ నటిస్తున్నాడు.

ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా రీతూ వర్మ నటిస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, పార్తీబన్, సిమ్రాన్, రాధిక, దివ్య దర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్లస్ లో విక్రమ్ టీమ్ హెడ్ పాత్రలో కనిపించనున్నాడు. ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోం ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధృవ నచ్చతిరమ్‌కి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

Latest News
 
'సాలార్' రెండో ట్రైలర్ త్వరలో విడుదల కానుందా? Sun, Dec 03, 2023, 09:03 PM
MMA నేర్చుకుంటున్న 'గుంటూరు కారం' నటి Sun, Dec 03, 2023, 09:00 PM
'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sun, Dec 03, 2023, 08:58 PM
పిక్ టాక్ : రొమాంటిక్ గెట‌వేలో వరుణ్ తేజ్, లావణ్య Sun, Dec 03, 2023, 08:55 PM
డుంకీని బీట్ చేసిన 'సాలార్' Sun, Dec 03, 2023, 08:48 PM